
న్యూఢిల్లీ : ఐదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ ఓ ప్రధాన మంత్రిలా కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలకు ‘‘బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్’’ మాదిరిగా పనిచేశారని పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను పక్కనబెడుతూ పారిశ్రామికవేత్తలకు భారీగా లబ్ధి చేకూర్చారన్నారు. మోదీ హయాంలో పారిశ్రామిక వేత్తలకు 18 భారీ కాంట్రాక్టులు కుదిరాయని సిద్దూ అన్నారు.శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రధానమంత్రి చేసిన విదేశీ పర్యటనలలో ఆయన వెంట ఇద్దరు ప్రముఖ పారిశ్రామిక వేత్తలను మాత్రమే తీసుకెళ్లారు కానీ ప్రభుత్వ సంస్థల చైర్మన్లను తీసుకెళ్లలేదన్నారు. మోదీ విదేశాలలో చేసుకున్న ఒప్పందాలు అధిక భాగం ఆ ఇద్దరికే దక్కాయని అని సిద్దూ ఆరోపించారు.
గతంలో మంచి లాభాల్లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు గత ఐదేళ్లలో నష్టాల్లో నెట్టుకొస్తున్నాయని విమర్శించారు. దేశానికి కాపలాదారు( చౌకిదార్) అని చెప్పుకునే మోదీ కేవలం ఒక శాతం ఉన్న ధనవంతులకే కాపలా కాస్తున్నారని ఆరోపించారు. వ్యాపారవేత్తలు అనిల్ అంబానీ, అదానీలకు బిజినెస్ డెవలప్‌మెంట్ మేజేజర్‌గా మోదీ పని చేస్తున్నారని విమర్శించారు. మోదీ హయంలో ఎస్‌బీఐ, ఎమ్‌టీఎన్‌ల్ లాంటి ప్రభుత్వ స్థలకు తీవ్ర నష్టాలు రాగ, పేటిఎమ్, రిలియన్స్ జియో లాంటి సంస్థలకు భారీ లాబాలు వచ్చాయన్నారు. ఓట్ల కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతియవాదాన్ని వాడుకుంటున్నారని, ఆయన ఓ జాతి వ్యతిరేకి విమర్శించారు. జాతియవాదాన్ని వాడుకోకుండా ప్రజలకు అవసరమైన అంశాలను చెప్పి మోదీ ఓట్లు అడిగే మంచిదని సిద్ధూ అభిప్రాయపడ్డారు.