
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులు.. చిత్రంలో వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వేంపల్లె: మండలంలోని టి. వెలమవారిపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో టపాసులు పేల్చి ఒక వ్యక్తి మృతికి కారకులయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసు కుంది. వివరాలిలా.. టి. వెలమవారిపల్లెలో వెఎస్సార్‌సీపీ నాయకుడు కందుల వెంకట రామిరెడ్డి ఇంటి ఎదుట మాజీ ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు విష్ణువర్దనరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వస్తుండగా ఇంటి వద్ద టపాసులు పేల్చవద్దని చెబుతున్నా వినకుండా వారు పెద్ద ఎత్తన పేల్చారు. దీంతో ఆరోగ్యం బాగాలేని వెంకటరామిరెడ్డి ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి మృతి చెందాడు. విషయం తెలుసుకొని వైఎస్ అవినాష్‌రెడ్డి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్‌వలి, కన్వీనర్ చంద్రఓబుళరెడ్డి తదితరులు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరా మర్శించారు. ఈ ఘటనపై మృతుడి బావ శంకర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment