
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 19 రోజులుగా నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమ వారం మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెంచుతూ ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.80కు, డీజిల్ ధర రూ.66.14కు చేరుకుంది. దీంతో డీజిల్ ధర గత 56 నెలల గరిష్టానికి చేరుకున్నట్లైంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఓఎంసీలు పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రతిరోజూ సవరిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, కర్ణాటక ఎన్నికల కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణను నిలిపివేశారా అన్న ప్రశ్నకు ఓఎంసీలు జవాబు దాటవేశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో పెరుగుదలతో పాటు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడటంతో గత 19 రోజుల్లో రూ.500 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు వెల్లడించాయి. ధరల పెంపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పంది స్తూ.. ‘కర్ణాటకలో ఎన్నికలు పూర్తికాగానే చము రు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఎంతమంది వీలైతే అంతమంది ప్రజల్ని, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మోసం చేయడమే మోదీనామిక్స్ కీలకసూత్రం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment