పంజాబ్‌లోని మలౌట్‌లో జరిగిన కిసాన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ
చండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో గత 70 ఏళ్లుగా ప్రజలను వంచించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పంజాబ్‌లోని మలౌట్‌లో బుధవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ రైతులకు కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. అన్నదాతల శ్రమను ఆ పార్టీ ఎన్నడూ గుర్తించలేదని దుయ్యబట్టారు. రైతులను కేవలం ఓటుబ్యాంక్‌గానే కాంగ్రెస్ పరిగణిస్తూ వారి సాధికారతను విస్మరించిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. భారత్‌ను వ్యవసాయంలో అగ్రగామిగా నిలపడంలో పంజాబ్ రైతుల పాత్ర తిరుగులేనిదని ప్రశంసించారు.
పంజాబ్ రైతులు కష్టించి పనిచేయడం ద్వారా రికార్డు స్ధాయిలో వ్యవసాయ ఉత్పత్తులను దేశానికి అందిస్తున్నారని కొనియాడారు.2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తాము కృషిచేస్తున్నామని ప్రధాని చెప్పుకొచ్చారు. కిసాన్ కళ్యాణ్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చని రైతులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment