పులివెందులలో వేడెక్కిన రాజకీయం | Political Heat in Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో వేడెక్కిన రాజకీయం

Published Sat, Mar 3 2018 2:19 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

Political Heat in Pulivendula - Sakshi

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో రాజకీయం వేడెక్కింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పులివెందులలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిధ్దమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి విసిరిన ప్రతిసవాల్‌కు టీడీపీ స్పందించింది. పులివెందులలో వైఎస్సార్‌ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నేతల సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సవాల్‌ను స్వీకరించిన వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎప్పుడు ఏ సెంటర్‌లో చర్చకు రావాలో చెప్పాలని ప్రతి సవాల్‌ విసిరారు. దీనిపై శనివారం టీడీపీ నేత సతీష్‌ రెడ్డి ఈ నెల 4 వతేదీ (ఆదివారం) సాయంత్రం చర్చకు సిధ్దమని ప్రకటించారు.

టీడీపీ ప్రకటనకు స్పందించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి.. ఎంపీ అవినాష్‌రెడ్డిలతో పాటు పార్టీ కార్యకర్తలంతా చర్చకు వస్తామని స్పష్టం చేశారు. టీడీపీ తాను చేయని అభివృద్దిని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. పులివెందులతో పాటు రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు. గడిచిన నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా చర్చిస్తామని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement