సాక్షి,సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార పగ్గాలు చేపట్టేందుకు తహతహలాడుతున్న బీజేపీ సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ్ కుమార్ ధుమల్‌ను తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది. సీనియర్ నేత ధుమల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్టు బీజేపీ చీఫ్ అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రేమ్ కుమార్ ధుమల్ నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోరాడుతుందని ట్విట్టర్‌లో అమిత్ షా పేర్కొన్నారు.
ధుమల్ నాయకత్వంలో భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్‌లో బీజేపీ విజయం సాధిస్తే సీనియర్ నేత సీఎం పగ్గాలు చేపడతారని అంతకుముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బీజేపీ సీఎం అభ్యర్థులుగా ప్రేమ్ కుమార్ ధుమల్‌తో పాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా పోటీ పడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 9న ఎన్నికలు జరగనుండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం డిసెంబర్ 18న ఇరు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment