హిమాచల్‌ కొత్త సీఎంపై నేడు ప్రకటన? | BJP may announce Himachal Pradesh CM on Sunday | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ కొత్త సీఎంపై నేడు ప్రకటన?

Published Sun, Dec 24 2017 3:22 AM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

BJP may announce Himachal Pradesh CM on Sunday - Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ కొత్త సీఎం ఎవరనేదానిపై ఆదివారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే ఎన్నికలు జరిగిన హిమాచల్‌లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ ఓటమి పాలవ్వడం తెలిసిందే. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జై రాం ఠాకూర్‌ తదితరుల పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటనా లేదు.

ఈ నేపథ్యంలో ఆదివారం బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుల అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిని ఈ సమావేశంలోనే ప్రకటించే అవకాశం ఉందనీ, అయితే అది ఇప్పుడే తాము కరాఖండీగా చెప్పలేమని కొందరు బీజేపీ సీనియర్‌ నేతలు అంటున్నారు. సమావేశానికి అధ్యక్షత వహించేందుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్‌ తోమర్‌లు రేపు హిమాచల్‌కు రానున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సత్పాల్‌ సింగ్‌ చెప్పారు. కాగా, గుజరాత్‌లో సీఎం విజయ్‌ రూపానీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఈనెల 26వ తేదీన కొలువుదీరనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement