కేరళ వరదలు.. మోదీకి రాహుల్‌ ట్వీట్‌ | Rahul Gandhi Request To PM Modi Declare Kerala Floods A National Disaster  | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 18 2018 12:19 PM | Last Updated on Sat, Aug 18 2018 12:22 PM

Rahul Gandhi Request To PM Modi Declare Kerala Floods A National Disaster  - Sakshi

ప్రియమైన ప్రధాని మోదీ గారు.. ఎలాంటి ఆలస్యం చేయకుండా కేరళ వరదలను..

న్యూఢిల్లీ : కేరళ వరదలను వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ట్విటర్‌ లో ‘ప్రియమైన ప్రధాని మోదీ గారు.. ఎలాంటి ఆలస్యం చేయకుండా కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. లక్షలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధి, భవిష్యత్‌ మీ చేతిలో ఉంది’ అని ట్వీట్‌ చేశారు. అంతకు ముందు కేరళ సహాయక చర్యల్లో పాల్గొనాలని, తమకు తోచిన సాయం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు శనివారం కేరళ వచ్చిన మోదీ రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వరద పరిస్థితిని ఏరియల్‌ సర్వే ద్వారా సమీక్షించిన మోదీ.. ఈ వరదల్లో మృతి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు నష్టపరిహారంగా ఇస్తామని కూడా చెప్పారు. 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో కేరళలో జనజీవనం పూర్తిగా స్థంభించింది. 300మంది ప్రాణాలు కోల్పోయారు.  త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మరో వైపు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ ప్రముఖులు, కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు ఇస్తూ అండగా నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement