‘అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఎత్తివేస్తాం’ | Rahul Promise To Remove Govt Exam Fees If We Come Into Power | Sakshi
Sakshi News home page

‘అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరీక్షల ఫీజు ఎత్తివేస్తాం’

Published Tue, Apr 9 2019 9:48 AM | Last Updated on Tue, Apr 9 2019 9:48 AM

Rahul Promise To Remove Govt Exam Fees If We Come Into Power - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు తొలి విడత పోలింగ్‌ సమయం సమీపిస్తున్నవేళ ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు అనేక హామీలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యువతను ఆకర్షించే విధంగా పథకాలను రూపొందిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ పరీక్షల దరఖాస్తు రుసుము లేకుండా చేస్తామని ప్రకటించారు. ఈమేరకు ఫేస్‌బుక్ వేదికగా ‘కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వసూలు చేసే పరీక్షల దరఖాస్తు ఫీజును ఎత్తివేస్తాం’ అని పోస్టు చేశారు. అదే విధంగా దేశ ప్రజలందరికీ ‘ఆరోగ్యం ప్రాథమిక హక్కు’గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని పోస్ట్‌లో పేర్కొన్నారు.

దానికి తగిన విధంగా బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తామని రాహుల్‌ వెల్లడించారు. కాగా కేంద్రంలో తము అధికారంలోకి వస్తే దేశద్రోహ చట్టం ఐపీసీ 124ఎను కూడా రద్దు చేస్తామని ఇదివరకే తెలిపారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్ అందులోనూ నిరుద్యోగులు, పేదలను ఆకర్షించే పథకాలను రూపొంచింది. ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేయడంతో పాటు.. ఉపాధి హామీ పనిదినాలు 150 రోజులకు పెంచుతామని హామి ఇచ్చింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement