రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 1.30 లక్షల కోట్లతో దేశ రక్షణశాఖపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని రాహుల్ మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ మరోసారి ట్విటర్‌లో స్పందించారు.
‘‘రాఫెల్ పేరుతో ప్రధాని మోదీ, అంబానీతో కలిసి దేశ రక్షణ దళంపైనే మెరుపు దాడులు చేశారు. ప్రధాని ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. సైనికుల రక్తాన్ని ఆగౌరపరిచారు. ఇది దేశానికే సిగ్గుచేటు. సైనికులను, దేశ ప్రజలను మోసం చేశారు’’ అని రాహుల్ మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సితారామన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఫ్రాన్సోవో హూలెన్ వ్యాఖ్యలతో మోదీపై ప్రతిపక్షం విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రధాని రహస్య పద్దతుల్లో మంతనాలు జరిపి ఒప్పందాన్ని మార్చివేశారని రాహుల్ ఇదివరకే విమర్శించిన విషయం తెలిసిందే.
The PM and Anil Ambani jointly carried out a One Hundred & Thirty Thousand Crore, SURGICAL STRIKE on the Indian Defence forces. Modi Ji you dishonoured the blood of our martyred soldiers. Shame on you. You betrayed India's soul. #Rafale
— Rahul Gandhi (@RahulGandhi) September 22, 2018
Comments
Please login to add a commentAdd a comment