
సాక్షి, బళ్లారి: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెలలో కర్ణాటకలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారని రాష్ట్ర మంత్రి రమేష్ జారికిహోళి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన హొసపేటలో రాష్ట్ర స్థాయి ఎస్‌టీల సమావేశం నిర్వహిస్తున్నామని, అందులో ఆయన ముఖ్యఅతిథిగా రాహుల్ పాల్గొంటారన్నారు. 27,28,29 తేదీలలో మూడు రోజులు పాటు కర్ణాటకలో ఆయన పర్యటన సాగుతుందన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాష్ట్ర పర్యటన విజయవంతం చేయడంతో పాటు కార్యకర్తలకు నూతనోత్సాహం నింపేందుకు ఆయన మూడు రోజులు కర్ణాటకలో మకాం వేస్తున్నారన్నారు. ఆయనతో పాటు హొసపేట సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ఇన్‌ఛార్జి వేణుగోపాల్, పలువురు మంత్రుల పాల్గొంటారన్నారు.