
సాక్షి, హైదరాబాద్ : శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి మతంతో ఎందుకు ముడిపెడుతున్నారని పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్ సీ కుంతియా ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు రావడం ద్వారా ఓ మత వర్గాన్ని టార్గెట్ చేసినట్లు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. రాజ్యాంగ పీఠికలో మనకు స్వేచ్ఛ.. హక్కును ఇచ్చిందని, దీనిని మార్చలేమని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీ వంటివి రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓ నినాదంతో ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు రామ్ జన్మభూమి నినాదం ఎత్తుకుందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని, నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద లైన్లలో నిలబడి 200 మందికి పైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. (సీపీ అంజనీ కుమార్‌పై విరుచుకుపడ్డ ఉత్తమ్)
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యిందని కుంతియా విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు శరద్ పవార్‌కు వ్యతిరేకంగా దాడులు జరిపించారని ఆరోపించారు. 2014 నుంచి దేశంలో జరుగుతున్న ప్రతి ఉద్యమంలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాలతో ‘భారత్ బచావో’ అనే నినాదంతో ర్యాలీ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ర్యాలీ చేయనీయడం లేదని మండిపడ్డారు. పోలీసులు రాజ్యాంగ బద్దంగా పనిచేయాలని సూచించారు. కేసీఆర్, ఎంఐఎం ప్రధాని నరేంద్రమోదీ కోసం పనిచేస్తున్నారని కుంతియా విమర్శించారు. చదవండి: 'కేసీఆర్ పాలన సామాజ్య్ర వాద శక్తులకంటే దారుణం'
Comments
Please login to add a commentAdd a comment