సాక్షి, హైదరాబాద్: తనను ‘స్కాంస్టార్’ పేర్కొంటూ తెలంగాణ మంత్రి కె. తారక రామారావు(కేటీఆర్) చేసిన ఆరోపణలకు ఫేక్‌బుక్ వేదికగా సమాధానం రేవంత్ రెడ్డి ఇచ్చారు. కేటీఆరే ‘స్కాంస్టార్’ అని కౌంటర్ ఇచ్చారు. తన ఆరోపణలకు రుజువుగా ‘ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం’ శీర్షికతో ఒక ఫొటోను ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సత్యం రామలింగరాజు తనయుడు తేజా రాజుతో పాటు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌ను కేటీఆర్ కలిసినప్పటి ఫొటోను వెలుగులోకి తెచ్చారు. ‘2016లో జరిగిన అధికారిక పర్యటనలో అనధికారికంగా తేజా రాజుతో మలేసియా ప్రధాన మంత్రిని కలిసిన కేటీఆర్‌కు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్’ అంటూ కామెంట్ కూడా రేవంత్ జోడించారు.
ఓటుకు కోట్లు కేసులో రేవంత్ తెలంగాణ పరువు తీశాడని మంత్రి కేటీఆర్ బుధవారం విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈసారి కొడంగల్‌లో టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన ఫేస్‌బుక్ పేజీలో కేటీఆర్ ఫొటో షేర్ చేయడం గమనార్హం.
రేవంత్‌రెడ్డి ఫేక్‌బుక్‌లో షేర్ చేసిన ఫొటో
ఇదిగో కేటీఆర్ దాచిన ‘సత్యం’
Published Thu, Nov 2 2017 2:35 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment