క్యా బాత్ హై
గ్రేటర్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.
నగరాభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి. మేయర్ పీఠంపై టీఆర్‌ఎస్ ఉంటేనే విశ్వనగరం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని అన్ని వర్గాలు గమనించాలని కోరుతున్నా.
- మెట్టుగూడ రోడ్డు షోలో మంత్రి కేటీఆర్
కాంగ్రెస్, టీడీపీలు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. అనవసరంగా మతతత్వం అంటూ ముద్ర వేస్తున్నాయి. మాతో జతకట్టి అధికారం పంచుకున్నప్పుడు మీకు మతతత్వం కన్పించలేదా?
- ఖిల్వత్ ఎన్నికల సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
బీజేపీ ప్రజలను మభ్యపెట్టే పార్టీ కాదు. మేం చేతలకే ప్రాధాన్యం ఇస్తాం. కేంద్రంలోని మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి మాకు మద్దతివ్వాలి
- యాప్రాల్ డివిజన్ రోడ్డు షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
గ్రేటర్ ప్రజలు మావైపే ఉన్నారు. ఈ ఎన్నికల్లో మేం మెజార్టీ స్థానాలు సాధిస్తాం. టీఆర్‌ఎస్ అభివృద్ధి హామీలను జనం విశ్వసించడం లేదు.
- బంజారాహిల్స్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం జాగీర్ కాదు. 1200 మంది ప్రాణత్యాగం వల్ల వచ్చింది. 20 నెలల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ప్రజా సమస్యలపై పూర్తి నిర్లక్ష్యం వహించారు.
- గౌతంనగర్ డివిజన్ ప్రచార సభలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి