తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుందని తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా మోడల్ కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. సర్కార్ ఆఫీసుల మీద ఉన్న ఫ్లెక్సీలు, ప్రభుత్వ భవనాలు, పబ్లిక సంస్థల మీద ఉన్న ప్రచార సామగ్రిని కూడా తొలగిస్తామని చెప్పారు. అధికార వాహనాలను అభ్యర్థులు వాడకూడదని వెల్లడించారు. 24 గంటల కంట్రోల్ రూంను సీఈఓ, డీఈఓ ఆఫీసులలో ఏర్పాటు చేసినట్లు, అలాగే ఫిర్యాదుల స్వీకరణకు 1950 అనే నెంబర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కొత్తగా సర్కారు కార్యాలయాలు కట్టకూడదని, ప్రచారం, ఖర్చుల మీద, క్యాష్, లిక్కర్, డ్రగ్స్ మీద నిఘా ఉంటుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ఆపాలని ఎక్కడా హైకోర్టు చెప్పలేదని తెలిపారు. నిబంధనల మేరకు ఎన్నికల కోసం అదనంగా సిబ్బందిని నియమించుకుంటున్నామని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పార్టీలు ప్రచారం చేయకూడదని అన్నారు. ఇప్పటి వరకు కోటి రూపాయలు సీజ్ చేశామని హైదరాబాద్ కమిషనర్ చెప్పారని వెల్లడించారు.
ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ నామినేషన్‌కు పది రోజుల ముందు వరకు కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఓటర్ కార్డుల జారీ మొదలైందని, అర్హులందరికీ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే కోడ్ ఉల్లంఘన మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. సర్కార్ వెబ్‌సైట్లలో సీఎం ఫోటో ఉంటే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే క్లోజ్డ్ గ్రూప్, సోషల్ మీడియా మీద ఫిర్యాదులు వస్తే విచారణ చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment