
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెళుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ గురువారం ‘టైమ్స్ నౌ’ తో మాట్లాడారు. ప్రజలు, దేవుడు వైఎస్సార కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారన్న వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస పార్టీ అధినేత రాహుల్ గాంధీ గురించి తాను ఇప్పుడేమీ మాట్లాడేది లేదని అన్నారు.