
సాక్షి, అనంతపురం: అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేశ్ భారీగా అవినీతికి పాల్పడ్డారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. శనివారం అనంతపురం జిల్లాకు వచ్చిన బాలకృష్ణ.. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలిచ్చేప్రయత్నం చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి ఒక్కటే అజెండా. ఎవరెవరో ఏవేవో విమర్శలు చేస్తుంటారు. వాటిని మేం పట్టించుకోం. పవన్ కల్యాణ్‌పై నేనేదో మాట్లాడి అతణ్ని హీరోని చెయ్యడం మాకు ఇష్టంలేదు. ఇప్పటికీ, ఎప్పటికీ మేమే హీరోలం’’ అని బాలకృష్ణ అన్నారు.
శనివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ ప్రయివేట్ మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని ప్రారంభించారు. అలాగే ఎంజీఎం క్రీడా మైదానంలోని ఎన్‌టీఆర్ ఇండోర్ స్టేడియం మరమ్మత్తుకు రెండు కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హిందుపురం అభివృద్ధికి ఎల్లవేళా పాటుపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment