
విజయనగరం : బీజేపీ పై టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..తమిళనాడులో బీజేపీ ఘోరపరాజయం పాలైందని గుర్తు చేశారు. బీజేపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు వాస్తవాలు గ్రహించాలని సూచించారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ప్రత్యేక ప్యాకేజీని సైతం బీజేపీ నేతలు పక్కనపెట్టారని విమర్శించారు. టీడీపీ నేతలను రెచ్చగోట్టే ప్రయత్నం చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. పోలవరాన్ని సైతం అడుగడుగునా అడ్డుకుంటున్నారని బీజేపీపై తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు.