సాక్షి, హైదరాబాద్: పంచాయితీరాజ్ చట్టానికి సవరణలపై కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లీకులు నిజమైతే తాము తీవ్రంగా వెతిరేకిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు తెలిపారు. ఈ సవరణ ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ప్రతిపాదనలు చూస్తే నవ్వొస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సర్పంచ్‌ల హక్కులు హరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సర్పంచ్‌లు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం కావాల్సిన అవసరముందన్నారు.
గ్రామ స్వరాజ్యం చిన్నాభిన్నం చేసే కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయితీలకు రావడం సీఎం తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ చట్టం సవరణ కోసం ఏర్పాటు చేసిన ఉపసంఘం ఉత్తుత్తిదే అన్నారు. గ్రామ సర్పంచ్‌లపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని.. ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే సర్పంచ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అయితే దీనికోసం తాను సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన చెప్పారు. ఎవరు పార్టీని వీడిన నష్టంలేదని.. పార్టీ నాయకుల కోసం కాదని.. దేశం కోసం పనిచేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment