పుర‘పోరు’కు తొలగని అడ్డంకులు | Telangana High Court Comments On Municipal Elections | Sakshi
Sakshi News home page

పుర‘పోరు’కు తొలగని అడ్డంకులు

Published Fri, Nov 1 2019 3:34 AM | Last Updated on Fri, Nov 1 2019 3:34 AM

Telangana High Court Comments On Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలకవర్గాల గడువు ముగిసిన మున్సిపాలిటీలన్నింటికీ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ యత్నాలకు అడ్డంకులు తొలగలేదు. గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం వద్ద ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో 77 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది. వీటి విషయంలో న్యాయపరమైన అవరోధాల తొలగింపునకు ఆదేశాలివ్వాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు అక్టోబర్‌ 22న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరా రు. ఎన్నికల ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా చేయ లేదని దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ అభ్యర్థన చేశారు. ఈ విషయాన్ని సింగిల్‌ జడ్జి దగ్గరే పరిష్కరించుకోవాలని డివిజన్‌ బెంచ్‌ చెప్పిన మేరకు అదనపు ఏజీ గురువారం యత్నించారు. గడువు ముగిసిన మున్సిపాల్టీలు అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా 77 మున్సిపాలిటీ లపై జారీ చేసిన స్టే ఉత్తర్వుల్ని రద్దు చేయాలన్నారు.

స్టేలు ఉన్న కేసుల్లోని అభ్యంతరాలపై దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తే ధర్మాసనం ఇచ్చిన తీర్పు సింగిల్‌ జడ్జి వద్ద మున్సిపాలిటీల కేసులకూ వర్తిస్తుందన్నారు. దీనిని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. 77 మున్సిపాలిటీలపై స్టే ఉత్తర్వులు, కేసుల వారీగా అభ్యంతరాలున్నాయని, వీటిలోని ఏ ఒక్క కేసులోనూ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయలేదన్నా రు. ఓటర్ల జాబితాల్లో లోపాలు తదితర అంశాలపై పిటిషనర్లు లేవనెత్తిన వాటిని పరిష్కరించకుండానే వ్యాజ్యాలన్నింటినీ తోసిపుచ్చమనడం చెల్లదని న్యాయవాది జంధ్యాల రవిశంకర్, ఇత రులు వాదించారు. ఎన్నికల ముందస్తు ప్రక్రియ పూర్తికి 119 రోజులు అవసరమని సింగిల్‌ జడ్జి వద్ద చెప్పిన ప్రభుత్వం ఆ ప్రక్రియను 30 రోజుల్లోనే ఎలా పూర్తి చేసిందో వివరించలేదన్నారు.

ఇరుపక్షాలూ అంగీకరిస్తే సరే.. 
వాదనలపై జస్టిస్‌ చల్లా కోదండరాం స్పందిస్తూ.. ధర్మాసనం తీర్పు తమ ముందు న్న కేసులన్నింటికీ వర్తిస్తుందని ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరిస్తే దీనికనుగుణంగా ఉత్తర్వు లు జారీ చేస్తామన్నారు. భిన్నాభిప్రాయాల్ని వ్యక్తంమవ్వడంతో ప్రతి పిటిషన్‌లో ప్రభుత్వం తన వాదనలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేశాక పిటిషన్ల వారీగా విచారించి తీర్పు వెలువరిస్తామన్నారు. లేనిపక్షంలో ధర్మాసనం తీర్పును పరిశీలించి ఆ తీర్పు తమ ముం దున్న కేసులకు వర్తిస్తుందో లేదో తేల్చుతామ న్నారు.

ఇదీ కాదంటే ఈ కేసులన్నింటినీ ధర్మాసనానికి నివేదిస్తామన్నారు. చట్టపరంగా విష యాల్ని తేల్చాలంటే ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులున్న కేసులన్నింటిలోనూ కౌంటర్‌ దాఖలు చేస్తే విడివిడిగా విచారిస్తామన్నారు. మున్సిపాల్టీలన్నింటికీ ఒకేసారి ఎన్నికల నిర్వ హణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, స్టేలున్న కేసులపై శుక్రవారం విచారించాలని అదనపు ఏజీ కోరారు. జాబితాలోని కేసుల్ని విచారించాక వీలుంటే విచారిస్తామని, లేకపోతే ఈ నెల 4న విచారిస్తామని న్యాయమూర్తి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement