భారీ ఆధిక్యం; టీఆర్‌ఎస్‌ సంబరాలు | TRS Celebrations In Telangana | Sakshi
Sakshi News home page

భారీ ఆధిక్యం; టీఆర్‌ఎస్‌ సంబరాలు

Dec 11 2018 9:49 AM | Updated on Dec 11 2018 9:59 AM

TRS Celebrations In Telangana - Sakshi

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయంగా దూసుకుపోతుండటంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయంగా దూసుకుపోతుండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు భారీ ఎత్తున  చేరుకున్న నాయకులు, కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. ప్రాథమిక ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ పార్టీ భారీ విజయం సాధించబోతోందని స్పష్టం కావడంతో స్వీట్లు, కేకులు పంచుకుంటున్నారు. కేసీఆర్‌ జిందాబాద్‌ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా సంచా కాల్చేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ కార్యాలయాల వద్ద సంబ​రాలు మొదలయ్యియి.

కాగా, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement