
సాక్షి, మెదక్: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతోంది. గ్రామపంచాయతీల ఏకగ్రీవాల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ సత్తా చాటుతోంది. తాజాగా అందోల్ నియోజకవర్గంలో 12 గ్రామాల్లో సర్పంచ్‌ల ఎన్నిక ఏకగీవ్రం కాగా.. ఈ 12 స్థానాలను టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. అల్లదుర్గం మండలం మందాపూర్, రెగోడ్ మండలం పెద్ద తండా, టేక్మాల్ మండలం మల్కాపూర్, చంద్రు తండా, సాంగ్యతాండ, అసన్ మహమ్మద్‌పల్లి, చెరువు ముందరి తండా, పుల్కల్ మండలం లింగంపల్లి, బద్దీరిగూడెం, గొంగళూర్ తండా, వట్‌పల్లి మండలం దర్కాస్‌పల్లి, గౌతంపూర్ తదితర గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment