
సాక్షి, కరీంనగర్ : అబద్ధాలు మాట్లాడటంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వొచ్చునని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కు తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అప్పులకు కార్మికులు కారణమైతే, మరి ప్రభుత్వ అప్పులకు కారణం ఎవరో సీఎం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవడంతో సీఎం ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి 20 లక్షల చొప్పున మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అదే మాదిరిగా ప్రతి గ్రామానికి రూ.20 లక్షలు ఇవ్వాలని సీఎంపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతున్నారు’అని సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment