
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రిగా దేశంకోసం ఇందిరాగాంధీ చేసిన త్యాగం నిరుపమానమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ జెండాను ఆదివారం ఎగురవేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
అంతకుముందు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్ నుంచి గాంధీభవన్ వరకు బైక్‌ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో, బలహీనవర్గాల సంక్షేమంలోనూ, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపుతెచ్చిన ఘనత ఇందిరమ్మది అని కొనియాడారు. ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment