మేడ్చల్: కేసీఆర్ వల్లే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటైం దని టీఆర్‌ఎస్ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 23న మేడ్చల్‌లో నిర్వహించనున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బహిరం గసభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టిన సమయంలో ఎంపీగా ఉన్నది కేసీఆర్ ఒక్కడేనని, రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ ఎంపీలంతా ఉమ్మడిగా పోరాడినందునే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ బిల్లు పాస్ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇస్తే మాయమాటలతో పీటమెక్కిన సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు రాష్ట్రాన్ని తమ జాగీరులా నాలుగున్నరేళ్లు దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో టీఆర్‌ఎస్ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
కేటీఆర్‌ను సీఎం చేసేందుకే ముందస్తు..
కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయాలనే దురాశతో ముందస్తుకు వెళ్ళాడని ఉత్తమ్ అన్నారు. టీఆర్‌ఎస్‌లో సీఎం కేసీఆర్ అవుతారో, హరీశ్‌రావు అవుతారో, కేటీఆర్ అవుతారో వారికే అర్థం కావడంలేదన్నారు. సమావేశంలో రాహుల్‌గాంధీ దూత కర్ణాటక ఎమ్మెల్సీ శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్, బోసురాజు, మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment