
సాక్షి, కామారెడ్డి : టీఆర్‌ఎస్ నుంచి పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. సోమవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రధాని మోదీ ఏజెంట్, కేసీఆర్‌కు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్టేనని చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లకార్డు ఉన్న దళితులకు, గిరిజనులకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తుందని, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment