లోకేష్‌.. తప్పమ్మా, కళ్లు పోతాయ్‌! | Vijaya Sai Reddy Slams Nara Lokesh On Twitter | Sakshi
Sakshi News home page

లోకేష్‌.. తప్పమ్మా, కళ్లు పోతాయ్‌!

Published Sun, Feb 24 2019 11:55 AM | Last Updated on Sun, Feb 24 2019 11:57 AM

Vijaya Sai Reddy Slams Nara Lokesh On Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘డియర్ లోకేష్.. మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా... మాకు మోదీ, కేసీఆర్‌లతో ఏం పని చెప్పు? తప్పమ్మా.. ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!’ అని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో.. ఓ సారి వైద్యులను సంప్రదించమని, మతిస్థిమితం లేని వాళ్లు మంత్రులుగా అనర్హులని ఘాటుగా విమర్శించారు. ‘లోకేష్, నీకు జగన్‌ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని ట్వీట్ చేసావు. మోదీ సంగతి తర్వాత ఆలోచిద్దువులే, ముందు నీ బాడీ ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో. మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాబు.. అది వాస్తవం కాదా..
తెలంగాణా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు పంపించిన రూ. 50 లక్షల హవాలా డబ్బు ఏ అకౌంట్ నుంచి తీసిచ్చారో జవాబు చెప్పండి చంద్రబాబూ అని ప్రశ్నించారు. వీడియో కెమెరాలో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారని, చంద్రబాబు సీఎం అయ్యాకే తెలుగు రాష్ట్రాల్లో హవాలా, హుండీ చీకటి వ్యాపారాలు పుంజుకున్నవిషయం వాస్తవం కాదా? అని నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement