
పంచాయితీరాజ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: పంచాయితీరాజ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనలో చాలా లోపాలున్నాయని, దీని వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. రైతుబంధుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద రైతులకే ప్రయోజనమని కోదండరాం తెలిపారు.