కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, పులివెందుల: అభివృద్ధిపై చర్చ జరిగితే టీడీపీ నేతలకు కూడా వాస్తవాలు తెలుస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. అర్థవంతమైన చర్చ జరిగేందుకు పోలీసులు
సహకరించాలని ఎంపీ కోరారు. పులివెందులలో ఆదివారం ఉదయం నుంచి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. అందరూ సంయమనం
పాటించాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దన్నారు. చట్టాన్ని, పోలీసులను గౌరవించాలన్న అవినాష్‌రెడ్డి.. సాయంత్రం 5గంటల వరకు ఇక్కడే ఉంటామని తెలిపారు.
వైఎస్ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ రాళ్లదాడి
పూల అంగళ్లు సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి 144 సెక్షన్ విధించారు. సర్కిల్ వద్దకు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులను అనుమతించని పోలీసులు మాత్రం టీడీపీ నేతలు బీటెక్ రవి,
రాంగోపాల్‌రెడ్డిని అనుమతించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాంతో పాటుగా మార్గం మధ్యలో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడి అడ్డుకునే యత్నం చేశారు. పరిస్థితిని
అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పులివెందుల రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment