నేడు జగన్‌ ప్రచారం ఇలా | YS Jagan election campaign schedule for 03 April | Sakshi
Sakshi News home page

నేడు జగన్‌ ప్రచారం ఇలా

Published Wed, Apr 3 2019 4:46 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 AM

YS Jagan election campaign schedule for 03 April - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ బుధవారం గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు, 3.30 గంటలకు కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటుచేసే బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు.

గజపతినగరం, మాడుగుల, చోడవరంలలో నేడు వైఎస్‌ విజయమ్మ ప్రచారం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ బుధవారం విజయనగరం జిల్లాలోని గజపతినగరం, విశాఖ జిల్లాలోని మాడుగుల, చోడవరం శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 

దెందులూరు, కైకలూరు, పెడనలలో షర్మిల ప్రచారం..
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు, కృష్ణా జిల్లాలోని కైకలూరు, పెడన  నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement