నెల్లూరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలు ఆపదలో ఉంటే ఐదు నిమిషాల్లో పోలీసులు రావడం అనేది ఎండమావిగా మారింది. బాబు హయాంలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు. రైతుల రుణాలు మాఫీ కాలేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో పదేళ్ల కిందటి కంటే ఇప్పుడు సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి తగ్గిపోయాయి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. కరెంటు చార్జీలను విపరీతంగా పెంచడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. దీనివల్ల నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది. నిరుద్యోగ భృతి కింద 60 నెలలకు గాను ఒక్కొక్కరికి రూ.1.20 లక్షలు ఇవ్వాలి. చంద్రబాబు ఆ సొమ్ము కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలను చంద్రబాబు మాఫీ చేయలేదు. దాంతో అవి వడ్డీలతో కలిపి రెండింతలయ్యాయి. సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదు. రాష్ట్రంలో ‘108’ అంబులెన్స్‌లు ఎక్కడా తిరగడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యం పాలైంది. ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇవ్వకపోగా, వారి నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. రాష్ట్రంలో ఏకంగా 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. మద్యం దుకాణాలు, అమ్మకాలు మాత్రం భారీగా పెరిగాయి.
కేశవరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటాం..: నంద్యాలలో కేశవరెడ్డి బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో కేశవరెడ్డి వియ్యంకుడు ఉన్నాడు. పిల్లల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో డిపాజిట్లు సేకరించిన కేశవరెడ్డి ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. బాధితులకు చంద్రబాబు పాలనలో న్యాయం జరగలేదు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేశవరెడ్డి ఆస్తులను కక్కిస్తాం. వాటిని అమ్మి బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తాం. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం రాగానే అగ్రిగోల్డ్ బాధితులను కచ్చితంగా అదుకుంటాం.
నంద్యాల ప్రజలను దగా చేశారు
19 నెలల క్రితం నంద్యాలలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్ని డ్రామాలు జరిగాయో అందరికీ తెలుసు. ఓట్ల కోసం గారడీలు చేశారు. మనుషులను కొన్నారు, భయపెట్టారు, ప్రలోభపెట్టారు. దేశంలో ఇంతటి అరాచకమైన, అన్యాయమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండవు. నంద్యాలలో 80 అడుగుల రోడ్డు విస్తరణలో నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చారా? 60 అడుగుల రోడ్డు విస్తరణ బాధితుల్లో 50 శాతం మందికి నష్టపరిహారం అందలేదు. ఓట్లు వేస్తే అందరికీ ఇళ్లు ఇస్తామని ఆశచూపి మోసం చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా ఆటోనగర్‌లో ఉన్న వారికి పట్టాలు ఇస్తామన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా?
Comments
Please login to add a commentAdd a comment