సాక్షి, నెల్లిమర్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. బుధవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మొయిదా జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తున్న సమయంలో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. రోడ్డు మొత్తం ఇసుకవేస్తే రాలనంతా జనంతో నిండిపోయింది. ఆ సమయంలోనే ఓ గర్భిణి ఆ మార్గంలో ఆటోలో వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ కాసేపు తన ప్రసంగాన్ని ఆపి.. ఆ ఆటోను దారి ఇవ్వాల్సిందిగా అభిమానుల్ని, కార్యకర్తలను కోరారు. ఆ వాహనం వెళ్లే వరకు ఆ గర్భిణీకి దారి ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. వైఎస్ జగన్ సూచనలతో సభకు హాజరైన జనాలు ఆటో జనసంద్రాన్ని దాటేలా సహాకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 అంబులెన్స్ సేవల గురించి ఆయన ప్రస్తావించారు. అంబులెన్స్‌లు లేక ఆపదలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పడానికి ఈ ఘటన ఓ ఊదాహరణగా నిలుస్తోందన్నారు. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లోనే అంబులెన్స్ కుయ్.. కుయ్.. కుయ్.. మంటూ వచ్చేదని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment