సాక్షి, చిత్తూరు: తాము అధికారంలోకి వచ్చాక చెరకు, బెల్లం తయారీ రైతులను ఆదుకుంటామని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీయిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 58వ రోజు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. గుండుపల్లిలో బెల్లం తయారీ రైతులతో వైఎస్ జగన్ మాట్లాడారు. పెట్టుబడి, మద్దతుధర గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
బెల్లానికి గిట్టుబాటు ధర లేకుండాపోతోందని వైఎస్ జగన్ ముందు ఆర్ముగం అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు అమ్ముకుందామన్నా షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ఎగుమతిపై కూడా ఆంక్షలు ఉన్నాయని వివరించారు. రైతుల సమస్యలను ఆలకించిన వైఎస్ జగన్.. మనందరి ప్రభుత్వం వచ్చాక చెరకు రైతులకు అన్నివిధాల అండగా ఉంటామని భరోసాయిచ్చారు. అంతకుముందు నల్లవెంగనపల్లిలో 800 కిలోమీటర్ల మైలురాయిని ఆయన అధిగమించారు. ఈ సందర్భంగా అక్కడ ఒక మొక్క నాటారు.
ఈరోజు 12.3 కిలోమీటర్లు..
58వ రోజు పాదయాత్రను గుండుపల్లిలో వైఎస్ జగన్ ముగించారు. చిప్పరపల్లి, జెట్టివాని ఒడ్డు, జెక్కిదొన, గంటావారిపల్లి, బొట్లవారిపల్లి, చిన్నబొట్లవారిపల్లి, నల్లవెంగనపల్లి, మటూరు క్రాస్, పాతగుంట, చెన్నుగారిపల్లి మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగింది. ఈరోజు ఆయన 12.3 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 804.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment