
సాక్షి, గోపాలపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వైఎస్ జగన్ నల్లజెర్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రకాసరావు పాలెం చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యునివర్సిటీ, తెలికిచర్ల క్రాస్ నుంచి వెంకటరామన్న గూడెం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. దారిపొడవునా ప్రజలు రాజన్న బిడ్డకు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా భరోసానిస్తూ జననేత అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటి వరకు పాదయాత్రలో వైఎస్ జగన్ 2,067 కిలోమీటర్లు నడిచారు.