
సాక్షి, విజయవాడ : నగరంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చియారు. శుక్రవారం విజయవాడ ఆర్వో కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తమపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని వారు తెలిపారు.