
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి ఐదు రోజులైనా ఇప్పటివరకు నోరు విప్పకుండా ఏ కలుగులో దాక్కున్నారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? ఉంటే నోరెందుకు విప్పడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీతో నాలుగేళ్ల సావాసంలో ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ఎంపీలు పార్లమెంటు లోపల వెల్‌లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తుంటే, కేంద్రమంత్రులుగా ఉన్న అదే పార్టీ వ్యక్తులు ఒకరేమో ప్రధాని పక్కన మరొకరేమో ఆర్థిక మంత్రి పక్కన కూర్చుని డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి బదులు ఆయనపై దాడులకు ప్రోత్సహిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం? అని నిలదీశారు.
రెండెకరాలున్న బాబుకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని వీర్రాజు అడిగారని, నిజంగా నీతిమంతుడవే అయితే దానికి జవాబు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. 8న వామపక్షాలు తలపెట్టిన బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే బంద్‌కు మద్దతు తెలపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment