
సాక్షి, గుడివాడ: పేదల గురించి ఆలోచించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పేదలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారని కొనియాడారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 155వ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రౌచౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో కొడాలి నాని పాల్గొని ప్రసంగిస్తారు.
గుడివాడలో పేదల కోసం 5 వేలకు పైగా ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్సార్‌దేనని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించడం కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని వైఎస్సార్ సేవల్ని గుర్తుచేసుకున్నారు. స్థానికులను తాగునీటి కష్టాల నుంచి బయటపడేసేందుకు వైఎస్సార్, గుడివాడలో 106 ఎకరాల్లో చెరువు తవ్వించారు. దేవుడు రూపంలో వచ్చిన వ్యక్తి వైఎస్సార్ అని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని, వైఎస్ జగన్ అధికారంలోకొస్తే ఏపీ ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment