
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మంగళవారం జరిగిన లాఠీచార్జ్ ఘటనను ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉప్పాడకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసనగా కొత్తపల్లి పోలీసు స్టేషన్ దగ్గర ఆందోళన చేసిన పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు.
చదవండి : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విరిగిన లాఠీ
ఈ ఘటనపై ఆయన బుధవారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కనీసం మహిళలని కూడా చూడకుండా స్పృహ కోల్పోయే విధంగా ఎలా కొడతారని ఎస్పీని ప్రశ్నించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలే కానీ టీడీపీ తొత్తులుగా మారొద్దన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధించడం సరికాదన్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా కారుతో సహా పోలింగ్ బూత్‌లోకి చొరబడ్డ ఎమ్మెల్యే వర్మపై ఇంతవరకు ఎందుకు కేసులు పెట్టలేదో పోలీసులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment