
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని ఆర్‌ఎంఎల్ వైద్యులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు ఈ ప్రకటన చేశారు.
పూర్తి స్థాయిలో సుబ్బారెడ్డి డీహైడ్రేషన్‌కు గురయ్యారని చెప్పారు. వెంటనే వైద్య చికిత్సలు అవసరమని తెలిపారు. వైద్య చికిత్సలు వెంటనే ప్రారంభించకపోతే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment