తాగునీటి ఎద్దడి తీవ్రం | Zp Meeting On Water Issues In Psr Nellore | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి తీవ్రం

Published Sun, May 6 2018 8:23 AM | Last Updated on Sun, May 6 2018 8:23 AM

Zp Meeting On Water Issues In Psr Nellore - Sakshi

నివాళులర్పిస్తున్న జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి, మంత్రులు నారాయణ, సోమిరెడ్డి

నెల్లూరు(అర్బన్‌): గత సమావేశాలకు భిన్నంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. దర్గామిట్టలోని నూతన జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సంతాప సభలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాల్సి ఉండటంతో అత్యవసరమైన నీటి ఎద్దడి అనే అంశంపై మాత్రమే సభ్యులు చర్చిం చాలని కోరారు. మిగిలిన అంశాలను వాయిదా వేశారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేయాలని కోరారు. నీటి ఎద్దడి, ఉన్న నిధులు, తాగునీటి పథకాలపై మా ట్లాడాల్సిందిగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డికి బొమ్మిరెడ్డి సూచించారు.

రెండేళ్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో 300 గ్రామాల్లో తాగునీటి సమస్యలు వస్తాయని అంచనా వేశామని, ఎద్దడి నివారణ కోసం రూ.9.05 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని కృష్ణారెడ్డి బదులిచ్చారు. మూడు నెలల క్రితం జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాన్ని చెప్పారని, ఇప్పుడూ అదే చెప్పడం సరికాదని జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయా..? మీ దగ్గర ఎంత నిధులున్నాయో సభలో మంత్రుల ముందే చెప్పాలని కోరారు. తమ వద్ద రూ.రెం డు కోట్లు ఉన్నాయని, సమస్య ఉన్న చోట వాడుకోవచ్చని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ తెలిపారు. కొత్తగా బోర్లు వేసే దానికి అనుమతి లేదని, ప్రస్తుతం 20 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. దీం తో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ.. అనుమతుల్లేవని ఎలా అంటారంటూ పొంతన లేకుండా మాట్లాడారు. అత్యవసరమైతే బోర్లు వేయాలని, ఈ విషయంలో కలెక్టర్‌తో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించాలని జేసీ వెట్రిసెల్వికి సూచించారు.

పొంతన లేని సమాధానాలు
ఫ్రీజింగ్‌తో తాగునీటి పథకాలకు 14వ ఆర్థిక సంఘ నిధులను ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడటం దారుణమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సైతం ఫ్రీజింగ్‌ వల్ల తాగునీటికి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీంతో సోమిరెడ్డి అడ్డు తగులుతూ.. ఫ్రీజింగ్‌ను తొలగించామని, ఆర్థిక సంఘానికి చెందిన 30 శాతం నిధులను గ్రామాల్లో తాగునీటి సరఫరా, పైపుల మరమ్మతులకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. ఇదే విషయాన్ని సభలో తెలపాలంటూ ఎస్‌ఈకి సోమిరెడ్డి సూచించడ ంతో.. ఫ్రీజింగ్‌ తొలగించారని ఇక ఇ బ్బ ంది లేదని బదులిచ్చారు. దీంతో మరో సారి మంత్రుల మాటలకు అధికారుల చె ప్పే దానికి పొంతన లేకుండా పోయిం ది.

సీపీడబ్ల్యూ స్కీమ్‌         అవినీతిపై దుమారం
జిల్లాలో ఏర్పాటు చేసిన సమగ్ర తాగునీటి పథకం(సీపీడబ్ల్యూ)లో అవినీతి రాజ్యమేలిందని అధికార పార్టీకి చెందిన కోవూరు జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు. జిల్లాలో 35 చోట్ల ఒకే కాంట్రాక్టర్‌ పనులు చేపట్టారని, 2015లో కోవూరులో రూ.ఐదు కోట్లతో ప్రారంభమైన పథకంలో మోటార్‌ ఆన్‌ చేస్తే పైప్‌లైన్లు పగిలిపోతున్నాయని విమర్శించారు. అలాంటి కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని సోమిరెడ్డి ఆదేశించారు. మొదట ఎంత అవినీతి జరిగిందో నిగ్గుతేల్చాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. పెన్నా బ్యారేజీకి దిగువన ఉన్న 17 గ్రామాల్లో భూగర్భజలాలను పెంచేందుకు, కలుషిత నీటిని అరికట్టేందుకు నదిలో నీటిని వదలాలని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈకి     మందలింపు
20 రోజుల క్రితం వచ్చిన పెనుగాలులకు తమ పంచాయతీలో ఒక విద్యుత్‌ స్తంభం నేలకొరిగిందని, ఇప్పటికీ స్తంభాన్ని మార్చలేదని దుత్తలూరు జెడ్పీటీసీ మల్లికార్జున తెలిపారు. వెంటనే స్తంభాన్ని మార్చాల్సిందిగా మంత్రి సూచించారు.

పాఠశాల స్థాయిలో ప్లస్‌     2 బోధన ప్రారంభించాలి
గత జెడ్పీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిరుపేద విద్యార్థులకు ఈ ఏడాది నుంచే పాఠశాల స్థాయిలో పది నియోజకవర్గాల్లో ఇం టర్‌ విద్యను ప్రారంభించాలని మంత్రి పొం గూరు నారాయణకు బొమ్మిరెడ్డి సూచిం చారు. గతంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని, ప్లస్‌ 2 విద్యను ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ బీద రవి చంద్ర కోరారు. ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుం టానని మంత్రి నారాయణ తెలిపారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పొట్టేళ్ల శిరీష, సీఈఓ సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు  తదితరలు పాల్గొన్నారు.

ఆనం వివేకాకు ఘన నివాళి
నెల్లూరు(అర్బన్‌): సుదీర్ఘ రాజకీయ చరిత్ర, తనకంటూ ఒక ప్రత్యేకతను చా టుకొని జిల్లా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన ఆనం వివేకానందరెడ్డి మృతికి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో స భ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులర్పి ంచారు. తొలుత రెండు నిమి షాలు మౌనం పాటించారు. అనంతరం ఆనం కుటుం బసభ్యులకు తమ సా నుభూతిని తెలియజేశారు. తొలుత జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లో విలక్షణ నా యకుడు ఆనం వివేకా అన్నారు. చిన్నపిల్లల్లో పిల్లాడిగా, వీఆర్‌ విద్యా సంస్థల కార్యదర్శిగా, కరస్పాండెంట్‌గా, సిం హపురి సేవాసమితి స్పోర్ట్స్‌ స్థాపకుడిగా, ప్రజా సమస్యల పరిష్కారంలో చు రుకైన నాయకుడిగా ఆనం వివేకానందరెడ్డి పేరుపొందారన్నారు. రాజకీయంగా విభేదాలున్నా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కలిగిన ప్రజా మనిషి అని మంత్రి సోమిరెడ్డి గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మా ట్లాడుతూ.. వివేకానందరెడ్డి మృతి జిల్లా ప్రజానీకానికి, వ్యక్తిగతంగా తనకు పూడ్చలేని లోటన్నారు. నెల్లూరు కోసం, కుటుంబం కోసం ఉన్నత రాజకీయ పదవులు వదులుకున్న వ్యక్తి, అపర చాణక్యుడు అన్నారు. తాను జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు సభకు వచ్చి అనేక సూచనలిస్తూ తన ఉన్నతికి సలహాలిచ్చేవారని గుర్తుచేసుకున్నారు. జెడ్పీటీసీలు వెంకటశేషయ్య, చేజర్ల వె ంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ సత్యనారాయణ సంతాపం తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement