రవిశాస్త్రి.. లైవ్‌లో ఇలానేనా మాట్లాడేది? | Ravi Shastri Trolled For Obscene Comment After India Win In Adelaide | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 1:29 PM | Last Updated on Wed, Dec 12 2018 5:14 PM

Ravi Shastri Trolled For Obscene Comment After India Win In Adelaide - Sakshi

రవిశాస్త్రి

అడిలైడ్‌: టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌ అనంతరం.. అధికారిక బ్రాడ్‌కాస్ట్‌ చానెల్‌ చర్చాకార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌తో కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడారు. ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. మ్యాచ్‌ సులవుగా గెలుస్తామనుకున్నామని, కానీ చివర్లో ఆసీస్‌ టేలండర్లు టెన్షన్‌ పెట్టారని తెలిపాడు.

హిందీలో ఈ వ్యాఖ్యలు చేసిన రవిశాస్త్రి అసభ్య పదజాలం ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ కావడంతో అభిమానులు మండిపడుతున్నారు. అడిలైడ్‌ టెస్ట్‌ హైలైట్స్‌.. పుజారా ఇన్నింగ్స్‌, పంత్‌ స్లెడ్జింగ్‌, రవిశాస్త్రి కామెంట్స్‌.. అని ఎద్దేవా చేస్తున్నారు. ఇక రవిశాస్త్రి అభిమానుల ఆగ్రహానికి గురికావడం ఇదే తొలిసారి కాదు. ఇంగ్లండ్‌ పర్యటనలో ప్రస్తుత భారత్‌ జట్టు గొప్పదని కొనియాడటం విమర్శలకు తావిచ్చింది. ఇక తొలి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న భారత్‌ పెర్త్‌ టెస్ట్‌కు సిద్దం అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement