
పవన్ కళ్యాణ్... మీరూ పాల్గొనండి
‘స్వచ్ఛ భారత్’లో సింధు
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ‘స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాల్గొంది. నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర స్కూల్ పిల్లలతో కలిసి రోడ్లను శుభ్రం చేసింది. స్వచ్ఛభారత్‌లో పాల్గొనే సెలబ్రిటీలు సాధారణంగా మరో 9 మందిని ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానిస్తారు. దీనిని గౌరవించిన వారు వచ్చి పాల్గొంటారు. టెన్నిస్ స్టార్ సానియామీర్జా ఇటీవల స్వచ్ఛభారత్‌లో పాల్గొని ప్రతిపాదించిన 9 మంది పేర్లలో సింధు కూడా ఉంది.
తాజాగా సింధు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి 9 మందిని కాకుండా ముగ్గురినే ప్రతిపాదించింది. ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్‌తో పాటు టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలలను స్వచ్ఛభారత్‌లో పాల్గొనాల్సిందిగా కోరింది.