అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో బీసీసీఐ నుంచి మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు పాల్గొనే అర్హత లేదని సుప్రీం కోర్టు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో బీసీసీఐ నుంచి మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు పాల్గొనే అర్హత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నట్టు గతంలో నిరూపితమైనందుకునే ఆయనకు ఈ అవకాశం లేదని తేల్చింది. అయితే ఈనెల 24న జరిగే ఐసీసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఈవో రాహుల్ జోహ్రిలకు కోర్టు అనుమతిచ్చింది.
ఇదే విషయంలో స్పష్టత కోసం ఇటీవల బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టు జోక్యాన్ని కోరిన విషయం తెలసిందే. ‘ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా అమితాబ్ వ్యవహరిస్తారు. ఆయనకు తోడుగా ఉండే జోహ్రి సీఈవోల సమావేశానికి హాజరవుతారు’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, ఏఎమ్ ఖన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ తెలిపింది.