‘డ్రా’ దిశగా ఆంధ్ర, హిమాచల్ మ్యాచ్ | andhra, himachal match towards draw | Sakshi
Sakshi News home page

‘డ్రా’ దిశగా ఆంధ్ర, హిమాచల్ మ్యాచ్

Published Sat, Jan 24 2015 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

andhra, himachal match towards draw

ధర్మశాల: ప్రతికూల వాతావరణం అంతరాయం కలిగించిన ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ ‘డ్రా’ కావడం ఇక లాంఛనమే. మూడు రోజుల ఆట ముగిసినా మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ కూడా పూర్తి కాలేదు. ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో శనివారం కాస్త ఎక్కువ సేపు ఆట జరిగినా, అదీ పూర్తి స్థాయిలో సాగలేదు.

ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 88.2 ఓవర్లలో 6 వికెట్లకు 301 పరుగులు చేసింది. శ్రీరామ్ (105; 10 ఫోర్లు) ఈ సీజన్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌లో ఏజీ ప్రదీప్ (50; 6 ఫోర్లు), రికీ భుయ్ (46; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడో రోజు 54.2 ఓవర్ల ఆట జరిగితే, ఆంధ్ర 178 పరుగులు చేసింది.
 హెచ్‌ఐఎల్‌లో రెండు మ్యాచ్‌లూ ‘డ్రా’
 
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా శుక్రవారం  పంజాబ్ వారియర్స్, దబాంగ్ ముంబై జట్ల మ్యాచ్ 3-3తో; ఢిల్లీ వేవ్‌రైడర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ జట్ల మ్యాచ్ 2-2తో ‘డ్రా’ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement