న్యూఢిల్లీ: కున్‌మింగ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో బుధవారం తొలి రౌండ్‌లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ సమంత స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం నమోదు చేసిన భారత నంబర్‌వన్ అంకిత రైనా... గురువారం మాత్రం అనూహ్య పరాజయం చవిచూసింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 178వ ర్యాంకర్ అంకిత 6–1, 6–7 (2/7), 6–7 (7/9)తో 209వ ర్యాంకర్ కై లిన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత నిర్ణాయక మూడో సెట్‌లో 5–1తో ఆధిక్యంలో నిలిచి విజయం అంచున నిలిచింది. అయితే కై లిన్ జాంగ్ పట్టువదలకుండా పోరాడింది. ఒత్తిడికి లోనైన అంకిత కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment