చెన్నై: మహిళల టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు; 1 సిక్స్), (3/13) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్ జట్టు 49 పరుగుల భారీ తేడాతో ఓడింది. మూడు ఓటములతో బంగ్లా టోర్నీ నుంచి నిష్ర్కమించినట్టే. ఆదివారం జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (42 బంతుల్లో 41; 4 ఫోర్లు), స్టెఫానీ టేలర్ రాణించారు. డాటిన్ (11 బంతుల్లో 24; 2 ఫోర్లు), స్టేసీ కింగ్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడారు. న హీదాకు మూడు వికెట్లు పడ్డాయి. బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిగర్ సుల్తానా (27 బంతుల్లో 27; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. హేలీ, డాటిన్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
శ్రీలంక మహిళల గెలుపు
మొహాలీ: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న శ్రీలంక మహిళల జట్టు... ఆదివారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 129 పరుగులు చేసింది. కౌసల్య (28 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు), జయాంగిని (22 బంతుల్లో 34; 7 ఫోర్లు), వీరక్కొడి (41 బంతుల్లో 32; 2 ఫోర్లు) రాణించారు. 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లంకను వీరక్కొడి, కౌసల్య ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఆదుకున్నారు.
మెట్‌కాల్ఫి 4 వికెట్లు తీసింది. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. సిసిలా జాయ్‌సీ (30 బంతుల్లో 29; 4 ఫోర్లు), డెల్ని (24 బంతుల్లో 29; 2 ఫోర్లు), ఐసోబెల్ జాయ్‌సీ (28 బంతుల్లో 24; 2 ఫోర్లు) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. సుగంధికా 3 వికెట్లు పడగొట్టింది.
విండీస్ మహిళలకు మరో విజయం
Published Mon, Mar 21 2016 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement
Advertisement