చైనాను హడలెత్తించిన భారత్
9-0తో భారీ విజయం
ఆసియా చాంపియన్‌స ట్రోఫీ హాకీ
క్వాంటన్ (మలేసియా): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సాధించిన విజయంతో జోరు మీదున్న భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో మరో భారీ విజయం సొంతం చేసుకొని సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. చైనాతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9-0 గోల్స్ తేడాతో అద్భుత విజయం దక్కించుకుంది.
ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (9వ, 39వ నిమిషంలో), యూసుఫ్ అఫాన్ (18వ, 40వ ని.లో), జస్జీత్ సింగ్ కుమార్ (22వ, 51వ ని.లో)రెండేసి గోల్స్ చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (24వ ని.లో), నికిన్ తిమ్మయ్య (33వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (36వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో భారత్ ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో 10 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. బుధవారం జరిగే చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య మలేసియా జట్టుతో భారత్ తలపడుతుంది. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
గాయం కారణంగా కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ఆకాశ్ చిక్టే గోల్‌కీపర్‌గా వ్యవహరించగా... రూపిందర్‌పాల్ సింగ్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. తొమ్మిదో నిమిషంలో ఆకాశ్‌దీప్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత చివరి నిమిషం వరకు చైనాపై పూర్తి ఆధిపత్యం చలారుుంచింది. భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు రాగా... ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. చైనాకు రెండు పెనాల్టీ కార్నర్‌లు వచ్చినా భారత గోల్‌కీపర్ ఆకాశ్ అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నిర్వీర్యం చేశాడు.