భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 30 ఓవర్లలో వికెట్ నష్టపోయి 155 పరుగులు పూర్తిచేసింది.
సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా గురువారమిక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 30 ఓవర్లలో వికెట్ నష్టపోయి 155 పరుగులు పూర్తిచేసింది. ఫించ్(55), స్మిత్(79) అర్థసెంచరీలు చేశారు.
15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ను వీరిద్దరూ నిలకడైన ఆటతీరుతో జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 162 బంతుల్లో 144 పరుగులు జోడించారు.