భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరుదిశగా దూసుకెళ్తోంది.
సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా గురువారమిక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరుదిశగా దూసుకెళ్తోంది. 36 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 216 పరుగులు చేసింది. స్మిత్(105) సెంచరీ చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఫించ్ తో కలిసి రెండో వికెట్ కు 186 బంతుల్లో 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.
ఫించ్(73), మ్యాక్స్ వెల్(8) క్రీజ్ లోఉన్నారు. ఓపెనర్ వార్నర్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు. ఉమేష్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు.