
వియన్నా: మూడేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. శనివారం ముగిసిన ఆస్ట్రియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కశ్యప్ 23–21, 21–14తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలుపొందాడు.
సెమీఫైనల్లో కశ్యప్ 21–18, 21–4తో రౌల్ మస్త్ (ఎస్తోనియా)ను ఓడించాడు. 2015లో సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలిచాక కశ్యప్ నెగ్గిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు స్విస్ ఓపెన్‌లో భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా ఫైనల్‌కు చేరాడు. సెమీఫైనల్లో సమీర్ వర్మ 21–14, 11–21, 21–12తో వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment